శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 14:50:42

దుండ‌గుల దాడి..వృద్ధుడు మృతి

దుండ‌గుల దాడి..వృద్ధుడు మృతి

ఫ‌గ్వారా:  పంజాబ్ లో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఇంట్లోకి చొర‌బ‌డి ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై రాడ్ల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 70 ఏళ్ల క‌శ్మీర్ సింగ్ అనే వ్య‌క్తి మృతి చెందాడు. మెహ‌త‌న్-మెహ్‌లీ ప‌గ్వారా బైపాస్ రోడ్డు వెంబ‌డి ఉన్న గురు నాన‌క్ న‌గ‌ర్ లో  ఇంట్లోకి చొర‌బ‌డిన దుండ‌గులు రాడ్ల‌తో దాడి చేశారు. వృద్ధుడు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా..అత‌ని భార్య సుపిత (60)కు తీవ్ర‌గాయాలవ‌డంతో ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నామ‌ని స‌దర్ ఎస్‌హెచ్‌వో అమ‌ర్‌జీత్ సింగ్ తెలిపారు. క‌శ్మీర్ సింగ్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo