బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 12:38:03

ఒడిశాలో కరోనాను జయించిన వృద్ధ దంపతులు

ఒడిశాలో కరోనాను జయించిన వృద్ధ దంపతులు

కేంద్రపారా : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో క్యాన్సర్ బాధితుడు సురేంద్ర పాల్(85), అతని భార్య సావిత్రి(78) కరోనా బారిన పడి ఇటీవల కోలుకున్నారు. ఈ విషయాన్ని  కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్‌ వర్మ ట్వీటర్‌ ద్వారా తెలియ‌జేశారు.  సురేంద్ర పాల్, సావిత్రి క‌రోనా నుంచి కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారని,  సురేంద్ర పాల్‌ గొంతు క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్నాడని తెలిపారు. ‘వారు ఈ వ్యాధిని ఓడించ‌డంలో చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. వారికి శుభాకాంక్షలు’ అని ట్విటర్‌లో కామెంట్‌ చేశారు.

కీమోథెర‌పీ కోసం సురేంద్ర పాల్‌ను జూన్ 8 న కటక్‌లోని ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంలో చేర్పించామని, అతని సంరక్షణ కోసం భార్య కూడా దవాఖానలోనే ఉండేవారిని కేంద్రపారా అదనపు జిల్లా వైద్య అధికారి ఎంహెచ్ బేగ్ తెలిపారు. అయితే జూన్ 29న వీరిద్దరూ కరోనా బారిన పడ్డార‌ని తెలిపారు. దీంతో వీరిని కటక్‌లోని కరోనా ప్రత్యేక దవాఖానకు త‌ర‌లించామ‌న్నారు. పది రోజుల చికిత్స తర్వాత క‌రోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారని బేగ్ చెప్పారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo