శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 20:17:49

ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ చేరిన ఎనిమిది లారీలు

ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ చేరిన ఎనిమిది లారీలు

అమృత్సర్: ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఎనిమిది సరుకు రవాణా లారీలు భారత్ చేరాయి. పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు నుంచి ఇవి దేశంలోకి ప్రవేశించినట్లు అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌కు చెందిన కస్టమ్స్ అధికారి చందన్ కుమార్ తెలిపారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రోడ్డు మార్గం ద్వారా రవాణా వాణిజ్యానికి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ లారీలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 16న రెండు సరుకు లారీలు రాగా సోమవారం మరో ఆరు సరుకు లారీలు వచ్చినట్లు ఆయన వివరించారు. కరోనా నియంత్రణ నిబంధనల మేరకు రసాయనాలను పిచికారీ చేయడంతోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారి చందన్ కుమార్ పేర్కొన్నారు.logo