ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 17:09:29

పిడుగుపాటుకి ఐదు జిల్లాలో 8 మంది మృతి

పిడుగుపాటుకి ఐదు జిల్లాలో 8 మంది మృతి

పాట్నా : పిడుగుపాటుకి ఐదు జిల్లాలో ఎనిమిది వ్య‌క్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘ‌ట‌న బిహార్ రాష్ర్టంలో నేడు చోటుచేసుకుంది. రాష్ర్ట ప్ర‌భుత్వ నివేదిక ప్ర‌కారం పూర్ణియాలో ముగ్గురు, బెగుసారాయ్‌లో ఇద్ద‌రు, పాట్నా, స‌హ‌ర్ష‌, ఈస్ట్ చంపార‌న్‌లో ఒక్కో వ్య‌క్తి మ‌ర‌ణించారు. అంత‌కుక్రితం ఈ నెల 4వ తేదీన సంభ‌వించిన ఐదు జిల్లాల్లో సంభ‌వించిన పిడుగుపాటుకి 20 మంది మృతిచెందారు. వీరిలో భోజ్‌పూర్ జిల్లా నుంచి తొమ్మిది మంది, సరన్ జిల్లా నుంచి ఐదుగురు, కైమూర్ జిల్లా నుంచి ముగ్గురు, పాట్నా నుంచి ఇద్దరు, బ‌క్స‌ర్‌లో ఒక‌రు మ‌ర‌ణించారు. గత 25 రోజుల్లో బీహార్‌లో 150 మందికి పైగా ఉరుములు, మెరుపులు, పిడుగుపాటుల కార‌ణంగా చ‌నిపోయారు.


logo