గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 13:24:42

ఆప్‌ మహిళా ఎమ్మెల్యేలు వీరే..

ఆప్‌ మహిళా ఎమ్మెల్యేలు వీరే..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ నెల 16న కొలువుదీరనుంది. ఆప్‌ 62 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇందులో 8 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌ తరపున 9 మంది మహిళలు పోటీ చేయగా 8 మంది గెలిచారు. భారతీయ జనతా పార్టీ ఐదుగురికి, కాంగ్రెస్‌ పార్టీ 10 మంది మహిళలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఆప్‌ తరపున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు.. అతిషి మర్లేనా(కల్కాజీ), ధనవతి చాందేలా(రాజౌరీ గార్డెన్‌), రాజ్‌కుమార్‌ ధిల్లాన్‌(హరినగర్‌), బండానా కుమారి(శాలీమర్‌బాగ్‌), ప్రీతి తోమర్‌(త్రినగర్‌ సిటీ), భావన గౌర్‌(పాలం), ప్రమీలా తోకస్‌(ఆర్కే పురం), రాఖీ బిర్లా(మంగోల్‌పూరి). కాగా సరితా సింగ్‌ అనే అభ్యర్థి రోహతస్‌ నగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జితేందర్‌ మహాజన్‌ గెలిచారు. ఆప్‌ తరపున గెలిచిన 8 మంది మహిళా ఎమ్మెల్యేల్లో అత్యంత ధనవంతురాలు ధనవతి చాందేలా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 593 మంది పురుషులు, 79 మంది మహిళలు పోటీ పడ్డారు.


logo
>>>>>>