మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 18:06:11

నితీశ్ కేబినెట్‌‌లో 8 మందిపై క్రిమిన‌ల్ కేసులు

నితీశ్ కేబినెట్‌‌లో 8 మందిపై క్రిమిన‌ల్ కేసులు

ప‌ట్నా: ‌బీహార్‌లో కొత్తగా ఏర్పాటైన నితీశ్‌కుమార్ కేబినెట్‌లో సగం మందికిపైగా క్రిమిన‌ల్ కేసులో పెండింగ్‌లో ఉన్నావాళ్లే ఉన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బీజేపీ-జేడీయూ కూట‌మి బీహార్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.  జేడీయూ అధ్య‌క్షుడు నితీశ్‌కుమార్ ముఖ్య‌మంత్రిగా, మ‌రో 13 మంది మంత్రులుగా ప్రమాణంచేశారు. మొత్తం 14 మందితో కూడిన ఆ కేబినెట్‌లో 8 మందిపై క్రిమిన‌ల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని అసోసియేషన్‌ ఫర్ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది.

మొత్తం మంత్రుల్లో జేడీయూకు చెందిన ఇద్దరు, బీజేపీకి చెందిన నలుగురు, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యుల‌ర్‌‌) నుంచి ఒకరు, వికాస్ శీల్ ఇన్‌సాన్‌ పార్టీకి చెందిన ఒక మంత్రిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వారి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఆ ఎనిమిది మందిలో ఆరుగురిపై తీవ్రమైన కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. ఇక మొత్తం 14 మంది మంత్రుల్లో 13 మంది కోటీశ్వరులే కావడం గమనార్హం. 

ఇక ఆ మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.3.93 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొన్న‌ది. తారాపూర్‌ నుంచి గెలిచిన మంత్రి మేవాలాల్ చౌద‌రికి అత్యధికంగా రూ.12.31 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక మంత్రుల్లో నలుగురి విద్యార్హత 8 నుంచి 12వ తరగతి మధ్యే ఉంది. మిగతా 10 మంది తాము గ్రాడ్యుయేట్లమని పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.