శనివారం 04 జూలై 2020
National - Jun 17, 2020 , 12:54:06

హిమాచల్‌ ప్రదేశ్‌లో మరో 8 కరోనా కేసులు

హిమాచల్‌ ప్రదేశ్‌లో మరో 8 కరోనా కేసులు

హిమాచల్‌ ప్రదేశలో కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం 8 పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళవారం 213 నమూనాలు సేకరించి టెస్టులు చేయగా అందులో 154 నెగిటీవ్‌, 8 పాజిటీవ్‌గా నిర్ధారించబడ్డాయి. ఇంకో 50 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. 1 నమూనా తిరస్కరించబడిందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. మొత్తం పాజిటీవ్‌ కేసుల సంఖ్య 568కి చేరగా అందులో 364 మంది కోలుకున్నారు.  185 ఆక్టీవ్‌ కేసులున్నాయి. అందులో 11 మంది వలస కూలీలున్నట్లు బులెటిన్‌లో వివరించారు. 


logo