న్యూఢిల్లీ : ఏడుగురు మహిళలు సహా 8 మంది నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా తట్టె హక్కలు నదిలో ముత్యపు చిప్పల కోసం వెతుకుతుండగా నదీ ప్రవాహం ధాటికి ఈ ప్రమాదం జరిగింది.
మరో ఇద్దరు గల్లంతయ్యారు. లోతైన ప్రాంతంలో ముత్యపు చిప్పల కోసం వెతికేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది.