గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 15:44:01

ఎనిమిది మంది డీఆర్‌ఐ అధికారుల హోం క్వారంటైన్‌!

ఎనిమిది మంది డీఆర్‌ఐ అధికారుల హోం క్వారంటైన్‌!

ముంబై: ఓ సిగరెట్‌ స్మగ్లింగ్‌ కేసును ఛేదించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులకు కరోనా భయం పట్టుకుంది. వారు పట్టుకున్న ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ తేలడంతో ఎనిమిది మంది అధికారులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

ఈ నెల 12న దుబాయ్‌ నుంచి రూ. 12 కోట్ల విలువైన సిగరెట్లను జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌కు అక్రమంగా దిగుమతి చేస్తున్న చెంబూరుకు చెందిన ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. అయితే, అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో డిప్యూటీ డెరెక్టర్‌ ఆఫ్‌ డీఆర్‌ఐతో సహా ఎనిమిది మంది హోంక్వారైట్‌న్‌లోకి వెళ్లారు. వారందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ డీఆర్‌ఐ (ముంబై జోనల్‌) రాజేశ్‌పాండే వెల్లడించారు.

 logo