శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 20:52:44

కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ బక్రీద్ జరుపుకోవాలి : అర్షద్‌ మదాని

కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ బక్రీద్ జరుపుకోవాలి : అర్షద్‌ మదాని

న్యూ ఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాలను అనుసరిస్తూ దేశంలోని ముస్లింలు ఈద్‌-ఉల్‌-అదాను (బక్రీద్‌)ను జరుపుకోవాలని జమాయతె ఉలేమా ఏ హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదాని అన్నారు. ఇస్లాంలో ఖుర్బానీ (జంతువుల త్యాగం) కు ప్రత్యామ్నాయం లేదని, ఇది అర్హత కలిగిన ప్రతి ముస్లింపై తప్పనిసరి అని అన్నారు. కరోనావైరస్ మహమ్మారి వల్ల కలిగే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ -19 మహమ్మారిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా పండుగను జరుపుకోవాలని ఆయన అన్నారు.

ఎప్పటికప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ని నిబంధనలను అనుసరించాలని సూచించారు.  భౌతిక దూరం పాటిస్తూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని తెలియజేశారు. సూర్యోదయం జరిగిన 20 నిమిషాల్లో, స్వల్ప వ్యవధిలో ఉపన్యాసం, ప్రార్థనలు పూర్తి చేయాలన్నారు. వెంటనే జంతు బలిని చేసి వ్యర్థాలను పూడ్చివేయాలని తెలిపారు.  ఆగస్టు 1వ తేదీని బక్రీద్‌ పండుగను ముస్లింలు జరుపుకోనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo