బుధవారం 03 జూన్ 2020
National - May 19, 2020 , 11:54:41

ఇంటివద్దే ఈద్ ప్రార్థనలు.. దేవబంద్ ఫత్వా

ఇంటివద్దే ఈద్ ప్రార్థనలు.. దేవబంద్ ఫత్వా

లక్నో: ముస్లింలు ఈద్ సందర్భంగా మసీదుల్లో గుమగూడకుండా ఇంటివద్దే ప్రార్థనలు జరుపుకోవాలని ఇస్లామిక్ మతసంస్థ దారుల్ ఉలూమ్ దేవబంద్ ఫత్వా జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందిుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఈ మతపరమైన ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది. కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ పెద్దఎత్తున జనం గుమిగూడే అవకాశమున్న మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతున్నది. జనం నుంచి వచ్చిన సందేహానికి నివృత్తిగా ఈ ఫత్వా జారీచేసినట్టు దేవబంద్ ప్రతినిధి అష్రాఫ్ ఉస్మానీ తెలిపారు. ప్రస్తుతం శుక్రవారం ప్రార్థనలు ఇంటిదగ్గర నుంచే చేసినట్టుగా ఈద్ నమాజ్ కూడా ఇంటి దగ్గరే చేసుకోవచ్చని ఫత్వా సూచిస్తున్నది. ముస్లింలు ఈనెల 24 లేదా 25న ఈద్ జరుపుకునే అవకాశముంది.


logo