శనివారం 06 జూన్ 2020
National - May 24, 2020 , 01:24:58

రేపే రంజాన్‌!

రేపే రంజాన్‌!

  • ఇండ్లలోనే ప్రార్థనలు చేయాలని ముస్లిం మత పెద్దల పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) పండుగను సోమవారం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. శనివారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనిపించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్‌ అహ్మద్‌ షా బుఖారీ తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున ఈద్‌ నమాజ్‌, పండుగ వేడుకలను ఇండ్లల్లోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్‌నాడు మసీదుల్లో నమాజ్‌ కార్యక్రమాలు నిర్వహించకపోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.  


logo