బుధవారం 15 జూలై 2020
National - Jun 27, 2020 , 17:00:17

కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ను విచారించిన ఈడీ

కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ను విచారించిన ఈడీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఢిల్లీలోని ఆయన నివాసంలో విచారించింది. బ్యాంకు రుణం కేసులో సందేసర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీపై విచారణ సందర్భంగా పటేల్‌ పేరు వెలుగులోకి వచ్చింది. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ (ఎస్‌బీఎల్),  సందేసర గ్రూప్, దాని ప్రధాన ప్రమోటర్లు నమ్లే నితిన్ సందేసర, చేతన్, దీప్తి రూ.14,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అహ్మద్ పటేల్ మాత్రమే కాదు, ఆయన కుమారుడు ఫైసల్ పటేల్, ఆయన అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖీని మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రశ్నించిన వారిలో ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ పేరు కూడా ఉంది.

ఆధారాల మేరకు ఈడీ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసి, ఇందులో తన ప్రమేయంపై అహ్మద్ పటేలేను విచారిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని ఈడీ గతంలో కోరింది. అయితే, కరోనా వైరస్ సంక్రమణ క్రమంలో తాను విచారణకు రాలేనని పేర్కొంటూ పటేల్ జూన్ 8న ఈడీకి లేఖ రాశారు. పటేల్ ఈడీ ముందు హాజరు కావడానికి ఒక రోజు ముందు, 65 వయసు పైబడిందని, తాను రాలేనని క్షమించండంటూ లేఖ రాశారు. కొవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం తాను ఇంటిలోనే ఉండాల్సి ఉంటుందని ఆయన ఈడీకి చెప్పారు. దీంతో అధికారులు విచారణ కోసం ఆయన ఇంటికి వెళ్లారు.


logo