శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:00:24

ట్రావెల్స్‌ కంపెనీల డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

ట్రావెల్స్‌ కంపెనీల డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

ఢిల్లీ : టూర్‌ అండ్‌ ట్రావెల్స్‌ కంపెనీలకు చెందిన పలువురి డైరెక్టర్లు, వీరి అకౌంటెట్ల ఇండ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు నేడు సోదాలు చేపట్టారు. ఢిల్లీ, గజియాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పత్రాలు, రూ. 3.57 కోట్ల నగదును అధికారులు సీజ్‌ చేశారు. అనధికార లావాదేవీల నిర్వహణ జరిగినట్లుగా గుర్తించారు.

ఫారెన్‌ ‌ ఎక్సేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. విదేశీయులకు ఇ-వీసా సేవలు అందించే పేరిట అనధికార చెల్లింపులకు సదరు సంస్థలు పాల్పడ్డట్లుగా గుర్తించారు. భారత ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా విదేశీయులకు ఇ-వీసా దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తున్నాయి. రెండు సంస్థలకు రూ.200 కోట్ల రూపాయలకు పైగా విదేశీ చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించారు. 


logo