మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 27, 2020 , 15:22:04

బ్యాంక్ స్కామ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కు క్లీన్ చీట్ ఇవ్వడం పై ఈడీ అభ్యంతరం

బ్యాంక్ స్కామ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కు క్లీన్ చీట్ ఇవ్వడం పై ఈడీ అభ్యంతరం

ముంబై : 25 వేల కోట్ల బ్యాంక్ స్కామ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు, మరికొందరికి ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపట్ల ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  (ఈడీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన ఈ కుంభకోణం గత ఏడాది రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అజిత్ పవార్ కు , ఇతరులకు ముంబై పోలీసులు ఇచ్చిన క్లీన్ చిట్ ను ఆమోదించరాదని ఈడీ ముంబై కోర్టును కోరింది. ఒకవేళ పోలీస్ క్లోజర్ రిపోర్టును కోర్టు అంగీకరించిన పక్షంలో అజిత్ పై ఉన్న మనీలాండరింగ్ కేసు కూడా క్లోజయినట్టే అని ఈ సంస్థ పేర్కొన్నది. కాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఈ పార్టీకి చెందిన 70 మందికి పైగా లీడర్లపై కేసులు ఉన్నట్టు గత ఏడాది అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.