ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 16:00:12

ఈ-వీసాల పేరుతో మోసం.. రూ.3.57 కోట్ల నగదు సీజ్

ఈ-వీసాల పేరుతో మోసం.. రూ.3.57 కోట్ల నగదు సీజ్

న్యూఢిల్లీ: ఈ-వీసాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న టూర్, ట్రావెల్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరఢా ఝులుపించింది. ఈ నెల 9న ఢిల్లీ, ఘజియాబాద్‌లోని 8 ప్రాంతాల్లో పలు టూర్, ట్రావెల్ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, సీఏల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపింది. లెక్కల్లో చూపని రూ.3.57 కోట్ల నగదు, పలు పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నది.

ఆయా టూర్, ట్రావెల్ కంపెనీలు విదేశీయులకు ఇ-వీసా సేవలను అందించే పేరుతో చెల్లింపు గేట్‌వేల ద్వారా అనధికారికంగా విదేశాల నుంచి లావాదేవీలు జరిపినట్లుగా తమకు సమాచారం అందినట్లు ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.logo