శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 18:13:46

రూ.62 లక్ష‌ల న‌గ‌దు.. 7 కేజీల బంగారు క‌డ్డీలు స్వాధీనం

రూ.62 లక్ష‌ల న‌గ‌దు.. 7 కేజీల బంగారు క‌డ్డీలు స్వాధీనం

ముంబై: రూ.62 లక్ష‌ల న‌గ‌దు, 7 కేజీల బంగారు క‌డ్డీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ న‌గ‌దు మార‌కంలో అక్రమ లావాదేవీల వ్యవహారానికి సంబంధించిన కేసుపై గ‌త కొన్ని రోజులుగా ఈడీ ద‌ర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా మ‌హారాష్ట్ర‌లోని ఔరంగ‌బాద్‌లో ఒక నిందితుడికి సంబందించిన మూడు ప్రాంగ‌ణాల్లో అధికారులు గురువారం త‌నిఖీ చేశారు. సోదాల్లో ల‌భించిన రూ.62 ల‌క్ష‌ల న‌గ‌దుతోపాటు 7 కిలోల బంగారు కడ్డీల‌ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో అక్ర‌మ న‌గ‌దు లావాదేవీల‌కు సంబంధించిన ఈ కేసుపై ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని ఈడీ అధికారులు తెలిపారు. 


logo