గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 06:53:06

ప్యాకేజీతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి...

ప్యాకేజీతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి...

డెహ్రాడూన్ : పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచేలా ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన ఆర్థిక ప్యాకేజీని ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ స్వాగతించారు. క‌రోనా మ‌హ‌మ్మారితో ఏర్ప‌డిన ఆర్థిక న‌ష్టాలను అధిగ‌మించేందుకు ప్ర‌ధాని మోదీ రూ.20 ల‌క్ష‌ల కోట్ల‌ను ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

భారీ ఆర్థిక ప్యాకేజీ ఇండియా స్వావ‌లంబ‌న సాధించే దిశ‌గా స‌హ‌క‌రిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌జ‌ల స‌హ‌కారంతో దేశంలో క‌రోనా నియంత్ర‌ణ‌లో ఉంద‌న్నారు. కార్మికులు, కూలీలు, రైతులు, కుటీర ప‌రిశ్ర‌మం, సూక్ష్మ చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తుంద‌ని చెప్పారు. అన్ని వ‌ర్గాల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగ‌డ‌మే కాకుండా..క్షేత్ర‌స్థాయిలో ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకుంటుంద‌న్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo