శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 13:36:05

ఆగ‌స్టు 24న ఉత్తర‌ప్ర‌దేశ్‌, కేర‌ళలో రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌లు

ఆగ‌స్టు 24న ఉత్తర‌ప్ర‌దేశ్‌, కేర‌ళలో రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌లు

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఆగ‌స్టు 24న ఉప ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ మేర‌కు భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) గురువారం తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎంపీ బేణి ప్ర‌సాద్ వ‌ర్మ‌, కేర‌ళ ఎంపీ వీరేంద్ర కుమార్ మ‌ర‌ణంతో ఖాళీ అయిన స్థానాలను ఉప ఎన్నిక‌లతో భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఈసీఐ వెల్ల‌డించింది. దీని కోసం ఆగ‌స్టు 6న నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని చెప్పింది. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ ఆగ‌స్టు 13 తేదీ అని, 14న స్క్రూటినీ, 17న నామినేష‌న్ల ఉప‌సం‌హ‌ర‌ణ‌, 24వ తేదీ సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని పేర్కొంది. అనంత‌రం సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్లు లెక్కింపు మొద‌ల‌వుతుంద‌ని, అదే రోజున ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయ‌ని ఈసీఐ తెలిపింది.logo