శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 15:03:52

ముంగేర్ ఎస్పీని త‌క్ష‌ణం తొల‌గించండి.. ఈసీ ఆదేశం

ముంగేర్ ఎస్పీని త‌క్ష‌ణం తొల‌గించండి.. ఈసీ ఆదేశం

హైద‌రాబాద్‌:  బీహార్‌లోని ముంగేర్‌లో సోమ‌వారం రాత్రి దుర్గామాత విగ్ర‌హా నిమ‌జ్జ‌నోత్స‌వంలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.  పోలీసుల‌కు, నిమ‌జ్జ‌న‌కారుల‌కు మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఓ వ్య‌క్తి మృతి చెంద‌గా, 20 మందికిపైగా పోలీసులు గాయ‌ప‌డ్డారు.  ఆ ఘ‌ట‌న ప‌ట్ల ఇవాళ భార‌త ఎన్నిక‌ల సంఘం స్పందించింది.  ముంగేర్ ఎస్పీని త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఈసీ ఆదేశించింది.  మ‌గధ డివిజిన‌ల్ క‌మిష‌న‌ర్ అసంగ చూబేతో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.  ఏడు రోజుల్లోగా ఆ విచార‌ణ పూర్తి కావాల‌ని ఈసీ ఆదేశించింది. ముంగేర్‌లో కొత్త డీఎం, ఎస్పీని నియ‌మించాల‌ని త‌న ఆదేశాల్లో ఈసీ పేర్కొన్న‌ది.  మ‌రోవైపు ఇవాళే ముంగేర్‌లో కొంద‌రు ఆందోళ‌న‌కారులు ఎస్‌డీవో, ఎస్పీ ఆఫీసుపై దాడి చేశారు.  ఆఫీసును ధ్వంసం చేయ‌డ‌మే కాకుండా,  వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు.  అక్టోబ‌ర్ 26వ తేదీ జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ను నిర‌స‌న‌కారులు వ్య‌తిరేకించారు.