మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 14:18:03

ఆ నోటీసుల‌తో మాకు సంబంధం లేదు: ఈసీఐ

ఆ నోటీసుల‌తో మాకు సంబంధం లేదు: ఈసీఐ

న్యూఢిల్లీ: నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధ్య‌క్షుడు శ‌ర‌ద్‌ప‌వార్‌కు మంగ‌ళ‌వారం ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నోటీసులు జారీచేసింది. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో త‌న ఆస్తుల‌కు సంబంధించి ప‌వార్ త‌ప్పుడు వివ‌రాల‌ను పొందుప‌ర్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఆరోప‌ణ‌ల‌పై ప‌వార్ వివ‌ర‌ణ కోరుతూ ఇన్‌క‌మ్ ట్యాక్స్ విభాగం నోటీసులు జారీచేసింది. అయితే, కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) సూచ‌న మేర‌కే సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప‌వార్‌కు నోటీసులు ఇచ్చింద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. శ‌ర‌ద్ ప‌వార్‌కు ఇన్‌క‌మ్ ట్యాక్స్ నోటీసుల జారీతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొన్న‌ది. త‌మ ఆదేశాల మేరుకే ప‌వార్‌కు ఇన్‌క‌మ్ ట్యాక్స్ నోటీసులు జారీ అయ్యాయంటూ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల్లో నిజం లేద‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, శ‌ర‌ద్‌ ప‌వార్ కంటే ముందే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక‌రే, ఆయ‌న కుమారుడు ఆదిత్య థాక‌రే, ఎన్సీపీ నాయ‌కురాలు సుప్రియా సూలేల‌కు కూడా ఎన్నిక‌ల అఫిడ‌విట్‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలని కోరుతూ ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నోటీసులు జారీచేసింది.                                 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo