ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 16:18:16

ఎన్నిక‌ల ప్ర‌చారం ఎలా చేద్దాం.. సూచనలివ్వండి: ఈసీ

ఎన్నిక‌ల ప్ర‌చారం ఎలా చేద్దాం.. సూచనలివ్వండి: ఈసీ

ఢిల్లీ : ఎన్నిక‌ల ప్ర‌చారం, బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డంపై జాతీయ, ప్రాంతీయ పార్టీల‌ను ఈ నెల 31వ తేదీలోగా త‌మ అభిప్రాయాల‌ను తెల‌పాల్సిందిగా భార‌త ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఈ ఏడాది చివ‌ర్లో బిహార్ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాల‌ను తెలుసుకోగోరింది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌లు సూప‌ర్ స్ప్రెడ‌ర్ ఈవెంట్‌గా మార‌వ‌ని ఓటర్ల‌కు భ‌రోసా ఇవ్వాల్సిందిగా కోరుతూ బిహార్ ప్ర‌తిప‌క్ష పార్టీలు శుక్ర‌వారంనాడు కోరాయి.    

ఈ నేప‌థ్యంలో జులై 31వ తేదీలోగా ఆయా పార్టీలు త‌మ అభిప్రాయాలు, స‌ల‌హాల‌ను పంపాల్సిందిగా కోరింది. త‌ద్వారా క‌రోనా సంక్షోభ కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి అవసరమైన మార్గదర్శకాలను నిర్ధారించ‌వ‌చ్చ‌ని ఈసీ రాజ‌కీయ పార్టీల‌కు రాసిన లేఖ‌లో పేర్కొంది. 

కోవిడ్ -19 మహమ్మారి బిహార్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. రాజధాని నగరం పాట్నాలో 89 కంటైన్మెంట్ జోన్లు ఉండ‌టం, మ‌రో 15 రోజుల పాటు 16 జిల్లాల్లో లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం వంటి చ‌ర్య‌ల‌ను వివ‌రిస్తూ ప్ర‌తిప‌క్షం మెమోరాండంలో తెలిపింది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 29 తో ముగుస్తుంది మరియు దీనికి ముందు కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాలి. ఈ నవంబర్ 29 తో ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. 


logo