ఆదివారం 29 మార్చి 2020
National - Mar 18, 2020 , 15:25:29

ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించింది.  రాష్ట్ర ఎన్నికల సంఘం  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన విషయం తెలిసిందే.  స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.  విచారణ అనంతరం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని వెల్లడించింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించవచ్చని పేర్కొంది. సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్టయింది.


logo