బుధవారం 03 మార్చి 2021
National - Jan 25, 2021 , 06:52:04

నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు

నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ డిజిటల్‌ బాటపట్టింది. నేటి నుంచి డిజిటల్‌ పద్ధతిలో ఓటరు గుర్తింపు పత్రాలను జారీచేయనుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో నేటినుంచి మొబైల్‌ ద్వారా ఈ-ఓటరు గుర్తింపు కార్డును ఈసీ జారీ చేయనుంది. ఈనెలాఖరు వరకు కొత్త ఓటర్లు ఈ-ఎపిక్‌ (ఎ‌ల‌క్ర్టా‌నిక్‌ ఫోటో ఐడెం‌టిటీ) కార్డులు జారీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.   

18 ఏండ్లు నిండిన యువతీ యువ‌కు‌లం‌ద‌రినీ ఓట‌ర్లుగా నమోదు చేయా‌లన్న లక్ష్యంగా ప్రతి ఏటా ఓటర్ల నమోదు జాబితా కార్యక్రమాన్ని ఈసీ నిర్వహిస్తున్నది. ఓటర్లు ఇప్పటివరకు తమ ఐడెంటిటీ కార్డు కోసం మీ-సేవా కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. తాజాగా ఆధు‌నిక సాంకే‌తిక పరి‌జ్ఞా‌నాన్ని విని‌యోగించిన ఎన్ని‌కల కమి‌షన్‌ స్మార్ట్‌‌ఫోన్‌ ద్వారా ఓటర్లు తమ ఓటర్‌ ఐడెంటీ కార్డును డౌన్‌‌లోడ్‌ చేసు‌కో‌వచ్చు.

VIDEOS

logo