మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 15:08:45

మధ్యప్రదేశ్‌లో భూకంపాలు

మధ్యప్రదేశ్‌లో భూకంపాలు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఆదివారం 4.3, 2.7 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ప్రకంపనలతో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదని పేర్కొన్నారు. సియోని నగరానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో 4.3 తీవ్రతతో భూకంప కేంద్రం గుర్తించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భోపాల్ సెంటర్ శాస్త్రవేత్త వేద్ ప్రకాష్ సింగ్ చెప్పారు. తర్వాత అదే ప్రాంతంలో ఉదయం 6.23 గంటలకు రిక్టర్‌ స్కేలుపై 2.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని తెలిపారు. సియోని జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మొదటి ప్రకంపనల సమయంలో ఇంటి తలుపులు, కిటకీలు, ఇతర వస్తువులు 15 సెకెన్ల పాటు కదిలాయని స్థానికులు తెలిపారు. భయంతో స్థానికులంతా చలిలో రాత్రంతా ఉన్నారని పేర్కొన్నారు. అక్టోబర్‌ 27 నుంచి జిల్లాలో నాలుగు సార్లు భూకంపాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.