గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 16:02:01

మణిపూర్‌, అండమాన్‌ దీవుల్లో భూకంపం

మణిపూర్‌, అండమాన్‌ దీవుల్లో భూకంపం

మణిపూర్‌/అండమాన్‌ నికోబార్‌దీవులు : మణిపూర్‌ రాష్ట్రంలోని ఉక్రూల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని డిగ్లీపూర్‌ ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై వీటి తీవ్రత 4.0, 4.1గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. మేఘాలయ రాష్ట్రంలోని తురా ప్రాంతంలో ఉదయం 12గంటల 24నిమిషాల ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైంది. భూ ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనలతో ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణంనష్టం సంభవించ లేదని అధికారులు పేర్కొన్నారు. 


logo