మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 10:32:27

మ‌హారాష్ట్ర‌లో కంపించిన భూమి.. 2.8 తీవ్ర‌త

మ‌హారాష్ట్ర‌లో కంపించిన భూమి.. 2.8 తీవ్ర‌త

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 2.8గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది. 

నిన్న రాత్రి ఈశాన్య రాష్ట్ర‌మైన మిజోరంలో కూడా భూకంపం సంభ‌వించింది. చంపాయ్‌లో రాత్రి 8 గంట‌కు భూమి కంపించింద‌ని, దీని తీవ్ర‌త 4.4గా న‌మోద‌య్యింద‌ని ఎన్‌సీఎస్ తెలిపింది. చంపాయ్‌కి 27 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ద‌ని వెల్ల‌డించింది. ‌ ‌logo