ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 15:06:49

ఢిల్లీలో భూకంపం

ఢిల్లీలో భూకంపం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఒకవైపు ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మూలిగేనక్కపై తాటిపండు పడినట్లు దేశ రాజధాని వాసులను భూకంపం భయపెట్టింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.4 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఉత్తర ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా  భూమి కంపించింది. దాంతో ఇండ్లలో నుంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఎలాంటి ప్రాణ, ఆస్థినష్టం సంభవించలేదని  తెలుస్తున్నది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి దేశ రాజధానిలో భూమి కంపించడం ఇది మూడోసారి. ఒకదాని వెంట మరొక భూ ప్రకంపనలు గత నెలలో రికార్డయ్యాయి.


logo