ఆదివారం 24 జనవరి 2021
National - Dec 02, 2020 , 11:00:21

ఘజియాబాద్‌లో భూకంపం

ఘజియాబాద్‌లో భూకంపం

న్యూఢిల్లీ : ఘజియాబాద్‌లో తక్కువ తీవ్రతతో బుధవారం భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలాజీ తెలిపింది. రిక్టర్‌ స్కేల్‌పై 2.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. తెల్లవారు జామున 4.05గంటల ప్రాంతంలో భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గుర్తించినట్లు పేర్కొంది. ఈ ఏడాదిలో ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఏప్రిల్‌ నుంచి 15కిపైగా తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపంతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. 


logo