గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 13:44:03

ముంబైలో భూకంపం.. 2.5 భూకంప తీవ్రత

ముంబైలో భూకంపం.. 2.5 భూకంప తీవ్రత

ముంబై: ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా జమ్ముకశ్మీర్‌, హర్యానా, ఢిల్లీ, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపిస్తున్నది. తాజాగా మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ రోజు ఉదయం 11.51ని.లకు భూ కంపించింది. భూకంప లేఖినిపై 2.5గా తీవ్రత నమోదయ్యింది. ఉత్తర ముంబైకి 103 కి.మీ. దూరంలో భూ కంప కేంద్రం ఉన్నదని సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. 

ఈ నెల 14, 15 తేదీల్లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రెండు సార్లు భూమి కంపించింది. ఆదివారం రాత్రి 5.5 తీవ్రతతో భూకంపం రాగా, సోమవారం 4.4 తీవ్రతతో భూమి కంపించింది. 


logo