శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 02:05:28

మిజోరంలో భూకంపాలు

మిజోరంలో భూకంపాలు

ఐజ్వాల్‌: మిజోరంలో ఆదివారం సాయంత్రం 4.16కు, అనంతరం సోమవారం ఉదయం 4.10కి భూకంపాలు సంభవించాయి. సోమవారం నాటి భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా నమోదైంది. భూకంప కేంద్రం భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని చంఫాయి జిల్లాలోని జోఖావ్తార్‌ వద్ద కేంద్రీకృతమై ఉంది. రాజధాని ఐజ్వాల్‌తోపాటు రాష్ట్రంలో పలుచోట్ల భూమి కంపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం జోరంతంగకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేసి వాకబు చేశారు. 


logo