శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 22:52:22

జ‌మ్ముక‌శ్మీర్‌‌లో భూకంపం

జ‌మ్ముక‌శ్మీర్‌‌లో భూకంపం

శ్రీన‌గ‌ర్‌: దేశంలోని ఉత్త‌రాది, ఈశాన్య‌ రాష్ట్రాల్లో గ‌త కొన్ని రోజులుగా వ‌రుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో జ‌మ్ముక‌శ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో మ‌ణిపూర్ ఎక్కువ‌గా  భూకంపాలకు ప్ర‌భావితం అవుతున్నాయి. తాజాగా సోమ‌వారం రాత్రి 10:02 గంట‌ల‌కు జ‌మ్ముక‌శ్మీర్‌లోని క‌త్రా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకున్న‌ది. క‌త్రాకు 87 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం న‌మోదైంద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ అధికారులు తెలిపారు. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.5గా న‌మోద‌య్యింద‌ని పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo