బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 07:11:03

హర్యానాలో వరుసగా రెండో రోజూ భూకంపం

హర్యానాలో వరుసగా రెండో రోజూ భూకంపం

న్యూఢిల్లీ: హర్యానాలో వరుసగా రెండో రోజూ భూమి కంపించింది. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భూకంపం సంభవించిందని, దీని తీవ్రత భూకంప లేఖినిపై 2.3గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. రోహ్‌తక్‌కు తూర్పు ఆగ్నేయంగా 15 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. 

నిన్న ఉదయం 4.18గంటల ప్రాంతంలో రోహ్‌తక్‌కు సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.1గా నమోదయ్యింది. జమ్ముకశ్మీర్‌లోని కాట్రా వద్ద మంగళవారం (జూన్‌ 16న) మధ్యాహ్నం భూమి కంపించింది. భూకంపలేఖినిపై 3.9గా తీవ్రత నమోదయ్యింది. కశ్మీర్‌లో వరుసగా మూడు రోజుల్లో నాలుగుసార్లు భూకంపం వచ్చింది.


logo