శనివారం 23 జనవరి 2021
National - Dec 04, 2020 , 07:24:24

ఒడిశా, ఉత్తరాఖండ్‌లో భూకంపం

ఒడిశా, ఉత్తరాఖండ్‌లో భూకంపం

భువనేశ్వర్‌: ఒడిశా, ఉత్తరాఖండ్‌లో భూమి స్వల్పంగా కంపించింది. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో భూకంపం వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 2.13 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.9గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. 

అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ తెల్లవారుజా మున 3.10 గంటలకు భూకంపం వచ్చిందని, దీని తీవ్రత 2.6గా నమోదయ్యిందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని, ఇంకా పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నదని తెలిపింది. 


logo