శనివారం 04 జూలై 2020
National - Jun 25, 2020 , 06:33:03

మిజోరంలో మళ్లీ భూకంపం.. 4.5 తీవ్రత

మిజోరంలో మళ్లీ భూకంపం.. 4.5 తీవ్రత

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మళ్లీ భూకంపం సంభవించింది. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి కొనసాగుతున్న భూకంపాల పరంపర కొనసాగుతున్నది. ఈ రోజు కూడా 4.5 తీవ్రతతో భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున (బుధవారం అర్ధరాత్రి) 1 గంటల 14 నిమిషాలకు చాంపాయ్‌ సమీపంలో భూకంపం సంభవించింది. చాంపాయ్‌కి 21 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. నిన్న ఉదయం కూడా చాంపాయ్‌ సమీపంలో 4.1 తీవ్రతతో భూమి కంపించింది.  
రాష్ట్రంలో మంగళవారం కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా ఉన్నదని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. ఆది, సోమవారాల్లో 12 గంటల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించిందని సీఎం జోరంతంగా తెలిపారు. చాంపాయ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం 4గంటల 16 నిమిషాలకు 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4గంటల 10 నిమిషాలకు ఐజ్వాల్‌ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.3గా నమోదయ్యింది. జూన్‌ 18న సాయంత్రం చాంపాయ్‌కి 98 కి.మీ. దూరంలో 5.0 తీవ్రతతో భూమి కంపించింది.


logo