బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 10:43:43

జ‌మ్ముక‌శ్మీర్‌లో 4.1 తీవ్ర‌త‌తో కంపించిన భూమి

జ‌మ్ముక‌శ్మీర్‌లో 4.1 తీవ్ర‌త‌తో కంపించిన భూమి

శ్రీన‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మ‌రోమారు భూకంపం సంభ‌వించింది. ఇవాళ‌ తెల్లవారుజామున 4.29 గంట‌ల‌కు పహల్‌గాం సమీపంలో భూమి కంపించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ ప్ర‌క‌టించింది. భూకంప కేంద్రం ఎక్క‌డ ఉంద‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని తెలిపింది. ఈ భూకంపం వ‌ల్ల ఆస్తి, ప్రాణ న‌ష్టానికి సంబంధించి ఇంకా వివారా‌లు తెలియాల్సి ఉంద‌ని వెల్ల‌డించింది. 

గత సోమ‌వారం కూడా జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం వ‌చ్చింది. హ‌న్లేకి ఈశాణ్యాన‌ 51 కిలోమీట‌ర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్ర‌త 3.5గా నమోద‌య్యింది. ‌