సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 09:32:03

జ‌మ్ములో భూకంపం.. 3.7 తీవ్ర‌త‌

జ‌మ్ములో భూకంపం.. 3.7 తీవ్ర‌త‌

శ్రీన‌గ‌ర్‌: హిమాల‌య ప‌ర్వ‌త సమీప‌ ప్రాంతాల్లో వ‌రుస భూకంపాలు సంభ‌విస్తున్నాయి. ఈరోజు ఉద‌యం గంట‌ల తేడాతో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని కాబూల్‌లో భూమి కంపించింది. ఇప్పుడు జ‌మ్ముక‌శ్మీర్‌లోని గుల్మార్గ్ స‌మీపంలో 8.19 గంట‌ల‌కు భూ ప్ర‌కంప‌ణ‌లు చోటుచేసుకున్నాయి. దీనితీవ్ర‌త భూకంప లేఖినిపై 3.7 గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. భూకంప కేంద్రం గుల్మార్గ్‌కు 281 కి.మీ. దూరంలో ఉన్న‌ద‌ని వెల్ల‌డించింది.  


logo