సోమవారం 13 జూలై 2020
National - Jun 15, 2020 , 13:55:10

గుజరాత్‌లో మరోమారు కంపించిన భూమి

గుజరాత్‌లో మరోమారు కంపించిన భూమి

హైదరాబాద్‌: గుజరాత్‌లో మరోమారు భూ కంపం సంభవించింది. భూ కంపలేఖినిపై తీవ్రత 4.4గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. రాజ్‌కోట్‌కు 83 కిలోమీటర్ల దూరంలో భూ కంప కేంద్రం ఉందని తెలిపింది. గుజరాత్‌లో భూ కంపం రావడం వరుసగా ఇది రెండో రోజు. ఆదివారం రాత్రి రాజ్‌కోట్‌ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదయ్యింది. రాజ్‌కోట్‌కు వాయువ్యంగా 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది.


logo