మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 08:20:40

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

పోర్ట్‌ బ్లెయిర్‌ : ఆండమాన్, నికోబార్‌లో 4.3 తీవ్రతతో ఆదివారం భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్‌లోని డిజ్లిపూర్‌లో సుమారు 2:30 నిమిషాలకు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదిక ప్రకారం భూమి కంపించినప్పుడు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని తెలిసింది. అంతకుముందు జూన్ 28న అదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. అదే రోజు, హర్యానాలోని అనేక ప్రాంతాల్లో భూమిలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి కుదిపేస్తుంటే ఈ భూకంపాలు వచ్చి మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. 

ప్రతి రెండు, నాలుగు రోజులకు, దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత వారం, జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరిలో అర్ధరాత్రి భూమి కంపించింది. మధ్యాహ్నం కూడా 2.12 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3గా భూకంప తీవ్రత నమోదైంది. కొద్దిరోజులుగా జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo