ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 19:17:04

జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం

జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో శ‌నివారం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై ఈ భూకంప తీవ్ర‌త 4.4గా న‌మోదైంది. హ‌న్లే ఏరియాకు ఈశాన్య దిశ‌గా 332 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం చోటుచేసుకుంది.  శ‌నివారం మ‌ధ్యాహ్నం 12.32 గంట‌ల‌కు ఈ భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయ‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సిస్మాల‌జీ వెల్ల‌డించింది. ఇదిలావుంటే, శుక్ర‌వారం కూడా  మేఘాల‌యాలో భూకంపం సంభ‌వించింది. తురా ఏరియాకు ప‌శ్చిమ దిశ‌గా 79 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం చోటుచేసుకుంది. రిక్ట‌ర్ స్కేలుపై ఆ భూకంప తీవ్ర‌త 3.3గా న‌మోదైంద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్ర‌క‌టించింది.      


logo