గురువారం 02 జూలై 2020
National - Apr 16, 2020 , 17:26:55

ఏప్రిల్ 20 నుంచి ఈ కామ‌ర్స్ సేవ‌లు

ఏప్రిల్ 20 నుంచి ఈ కామ‌ర్స్ సేవ‌లు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ కంపెనీల సేవలు ఈ నెల 20 నుంచి పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్స్‌, స్టేషనరీ వస్తువులు సహా త‌దిత‌ర‌ ఉత్పత్తులను విక్రయంచ‌డానికి అనుమతిస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ఈ కామర్స్‌ సేవలకు అనుమతిస్తామని బుధవారమే హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన‌ప్ప‌టికీ నిత్యావసర వస్తువులు, సేవల వరకే అనుమతిస్తారా? అన్ని ఉత్పత్తుల విక్రయానికి అనుమతిస్తారా? అనే విష‌యంలో స్పష్టత ఇవ్వలేదు. ఆహారం, ఫార్మాస్యూటికల్స్‌, వైద్య పరికరాలు వంటి అత్యవసర వస్తువులనే విక్రయించాలని గత నోటిఫికేషన్ల‌లో హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక‌ తాజా నిర్ణయంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ కంపెనీల సేవలన్నీ ఏప్రిల్ 20 నుంచి పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo