బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 14:51:48

కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించిన నడ్డా

కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించిన నడ్డా

న్యూఢిల్లీ : కార్గిల్ విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర సైనికులకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్‌ యుద్ధంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొని దేశ సరిహద్దులను కాపాడిన అమర సైనికుల సేవలను కొనియాడారు. 21 సంవత్సరాల కిందట మన సైన్యం ధైర్య సాహసాలు, శౌర్యాన్ని కార్గిల్‌లో ప్రదర్శించాయని, శాంతియుత ప్రాంతాల్లో అశాంతి సృష్టించాలనుకున్న పాకిస్థాన్‌ దురుద్దేశాన్ని ఓడించారని బీజేపీ చీఫ్‌ అన్నారు. ప్రస్తుతం భారత్‌ - చైనా పరిస్థితులపై మాట్లాడుతూ ప్రధాన నరేంద్రమోదీ స్వయంగా లడఖ్‌కు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారన్నారు. జవాన్లతో సమావేశమై వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి, గాయపడిన జవాన్లను కలుకున్నారని తెలిపారు. ప్రధాని నాయకత్వంలో 130 కోట్ల మంది భారతీయులు ఆర్మీకి అండగా నిలుస్తున్నారని వారికి సందేశం పంపినట్లవుతుందని నడ్డా తెలిపారు. దేశ రక్షణకు సంబంధించిన అంశంపై ప్రధాని మోదీ పలు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo