సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 23:30:01

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఈ నెల 31 వరకు పొడగించిన ఢిల్లీ యూనివర్సిటీ

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఈ నెల 31 వరకు పొడగించిన ఢిల్లీ యూనివర్సిటీ

న్యూ ఢిల్లీ : అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల ౩1 వరకు పొడగించినట్లు ఢిల్లీ యూనివర్సిటీ శనివారం ప్రకటించింది.  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇప్పటికే 12వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రకటించింది.  ఇంతకు ముందు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 4 కాగా, 18 వరకు పొడగించారు. ప్రస్తుతం మళ్లీ నెలాఖరు వరకు గడువును పెంచారు.

శనివారం రాత్రి 9 గంటల వరకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 4,44,198 మంది ఔత్సాహికులు పోర్టల్ లో నమోదు చేయగా, 2,91,469 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారని యూనివర్సిటీ తెలిపింది.  ఇదే సమయంలో 1,66,933 మంది ఔత్సాహికులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,34,068 మంది అభ్యర్థులు ఈ పేమెంట్ చేశారని తెలిపింది.  ఎం.ఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి 30,107 మంది ఔత్సాహికులు పోర్టల్ లో నమోదు చేసుకోగా 19,170 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపు ద్వారా ప్రక్రియను పూర్తి చేశారని వర్సిటీ తెలిపింది. యూనివర్సిటీ జూన్‌ 20న అడ్మిషన్ల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌ ఆలస్యమైంది. logo