బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 17:23:13

విశాఖలో డీఎస్పీ అనుమానాస్పద మృతి

విశాఖలో డీఎస్పీ అనుమానాస్పద మృతి

విశాఖలో డీఎస్పీ కృష్ణవర్మ అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకులం జిల్లాలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ విశాఖలోని అప్పుగర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. మానసిక సమస్యలతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతున్నా పలు భిన్న అనుమానాలు తావిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకులంలో విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ విశాఖలోని అప్పుగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా అనారోగ్య కారణాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే బట్టలు ఆరబెట్టేందుకు తాడు కట్టబోయి అదుపు తప్పి కింద పడిపోయినట్లు, కుటుంబ సభ్యులు చూసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుకు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు కారణం ఏం జరిగిందని తెలియాల్సి ఉంది.logo