కరోనా వ్యాక్సిన్ పంపణీపై ఆ నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్..

హైదరాబాద్ : ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు ఫార్మా సంస్థలు ఇప్పటికే టీకాలను అభివృద్ధి చేశాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పంపణీని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. టీకా పంపిణీ సన్నద్ధతలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో రెండురోజులపాటు డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఆయా రాష్ట్రాల్లో రెండు జిల్లాల చొప్పున ఎంపిక చేసి జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంతాలు, ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలు, గ్రామీణ ప్రాంతాలను అధికారుల బృందం పరిశీలించనుంది. పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై స్థానిక అధికారులతో చర్చించనుంది. డ్రై రన్లో క్షేత్రస్థాయిలో ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. టీకా ట్రయల్ రన్‌కు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీకా పంపిణీలో సమస్యలను గుర్తించడమే ఈ డ్రై రన్ ముఖ్య ఉద్దేశమని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి
- యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొండగింపు
- పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వరుణ్