గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 16:50:55

కరోనా విధులు.. మద్యం మత్తులో పోలీసు

కరోనా విధులు.. మద్యం మత్తులో పోలీసు

తిరువనంతపురం : కరోనా విధుల్లో ఉన్న ఓ పోలీసు పీకల దాకా మద్యం సేవించి.. ప్రజలతో గొడవ పెట్టుకున్నారు. ఈ ఘటన కేరళ వయనాడ్‌ రీజియన్‌లోని కేనిచిరా పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కేనిచిరా పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న మోహనన్‌ను కరోనా కంట్రోల్‌ సెంటర్‌కు కేటాయించారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు ఆఫీసర్‌ పీకల దాకా మద్యం సేవించి కేనిచిరా పట్టణానికి తన వాహనంపై చేరుకున్నారు. అక్కడ పోలీసు ఆఫీసర్‌ ఆందోళనకు దిగారు. ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ పోలీసును ప్రజలు అడ్డుకుని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఏఎస్‌ఐను అదుపులోకి తీసుకున్నారు. అతని రక్త నమూనాలు సేకరించి.. పరీక్షించగా ఆల్కహాల్‌ సేవించినట్లు తేలింది. దీంతో ఏఎస్‌ఐపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 


logo