మంగళవారం 31 మార్చి 2020
National - Mar 16, 2020 , 16:17:16

మూత్రానికి వెళ్లిన సమయంలో.. బీఎండబ్ల్యూ చోరీ

మూత్రానికి వెళ్లిన సమయంలో.. బీఎండబ్ల్యూ చోరీ

నోయిడా : ఓ వ్యక్తి మద్యం మత్తులో తూలుతూ మూత్రానికి వెళ్లిన సమయంలో.. అతడి బీఎండబ్ల్యూ కారును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్‌ 90లో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రిషభ్‌ ఆరోరా అనే వ్యక్తి వృత్తి రీత్యా స్టాక్‌ బ్రోకర్‌. ఆయన శనివారం రాత్రి ఓ పార్టీకి వెళ్లి మద్యం అతిగా సేవించాడు. మద్యం మత్తులోనే బీఎండబ్ల్యూ కారును డ్రైవింగ్‌ చేస్తూ ఇంటికి బయల్దేరాడు. దారి మధ్యలో మూత్రం కోసం కారును ఆపాడు.

మూత్రానికి వెళ్లిన సమయంలోనే.. గుర్తు తెలియని వ్యక్తులు బీఎండబ్ల్యూను చోరీ చేశారు. మరుసటి రోజు బాధితుడు ఆరోరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కారు ఆరోరా బామ్మర్దిగా పోలీసులు గుర్తించారు. కారుపై రూ. 40 లక్షల లోన్‌ పెండింగ్‌ ఉంది. కారు యజమానికి సన్నిహతులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 


logo
>>>>>>