గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 16:10:23

మద్యం మత్తులో చిన్నారిని చంపిన తండ్రి

మద్యం మత్తులో చిన్నారిని చంపిన తండ్రి

లక్నో: మద్యం మత్తులో ఓ మానవ మృగం క్రూరంగా ప్రవర్తించింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే తన బిడ్డ ప్రాణం తీశాడు. అసలే కరోనా కాలం. చేతిలో చిల్లి గవ్వలేకున్నా కష్టంగానైనా సంతోషంగానే గడుస్తున్నది ఆ ఇళ్లు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లోకి పులి మీద పుట్రలా వచ్చి పడింది మద్యం. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మద్యం అమ్మకాలకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో బడౌన్‌లో ఓ తండ్రి పూటుగా తాగివచ్చి తన భార్యతో గొడవకు దిగాడు. వారిద్దరి మధ్య వారి రెండేండ్ల కూతురు వచ్చింది. భార్యపై కోపంతో ఆ చిన్నారిని నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ పాపను ఇతర కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకువెళ్లారు. అయితే ఆ అమ్మాయి అప్పటికే కన్నుమూసింది. ఆ తాగుబోతు తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అతనిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేకపోవడం విశేషం. 


logo