గురువారం 09 జూలై 2020
National - Jun 27, 2020 , 14:42:09

డప్పులు కొట్టి మిడ‌త‌ల త‌ర‌మి.. వీడియో

డప్పులు కొట్టి మిడ‌త‌ల త‌ర‌మి.. వీడియో

న్యూఢిల్లీ: దేశంలో మిడ‌త‌ల గుంపుల స్వైర విహారం కొన‌సాగుతూనే ఉన్న‌ది. సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతం నుంచి పాకిస్థాన్ మీదుగా దేశంలో ప్ర‌వేశించిన మిడ‌త‌లు వివిధ రాష్ట్రాల్లో పంట‌ల‌కు న‌ష్టం వాటిల్ల‌జేస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌స్ధాన్, పంజాబ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌ల్లో పంట‌ల‌పై దాడి చేసిన మిడ‌త‌లు ఇప్పుడు హ‌ర్యానాలో కూడా ప్ర‌వేశించాయి. ‌

హ‌ర్యానాలోని జ‌జ్జ‌ర్ స‌హా ప‌లు జిల్లాల్లోని పంట చెల‌క‌ల‌పై మిడ‌త‌ల గుంపులు దాడులు చేస్తున్నాయి. దీంతో జ‌జ్జ‌ర్ జిల్లా అధికార యంత్రాంగం మిడ‌త‌ల‌ను త‌రిమికొట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మిడత‌ల ప్ర‌భావం ఉన్న ప్ర‌తి గ్రామానికి స్థానిక‌ సిబ్బంది వెళ్లి సైర‌న్‌ల సాయంతో వాటిని త‌రిమి కొడుతున్నారు. మ‌రోవైపు స్థానికులు కూడా గిన్నెలు, బిందులు కొడుతూ.. డ్ర‌మ్స్ వాయిస్తూ మిడ‌త‌ల‌ను త‌రుముతున్నారు. logo