శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 10:05:19

అస్సాంలో 6.4 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

అస్సాంలో 6.4 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

చందేల్ : అస్సాంలోని చందేల్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రూ.6.4 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అస్సాం రైఫిల్స్‌ శనివారం స్వాధీనం చేసుకున్నాయి. మోల్తుక్ గ్రామ సరిహద్దు అటవీ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు నిల్వ చేశారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు అస్సాం రైఫిల్స్ తనిఖీ ఆపరేషన్‌ చేపట్టాయి. అటవీ ప్రాంతంలో విస్తృతంగా శోధించగా 670 గ్రాముల హెరాయిన్, భారీగా డబ్ల్యూఐవై టాబ్లెట్ల పట్టుబడ్డాయి. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్లకుపైగా ఉంటుందని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చందేల్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి అస్సాంకు వీటిని రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.